- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాట్‌జీపీటీ-5 విడుదల.. టార్గెట్‌గా భారత మార్కెట్!
చాట్‌జీపీటీ-5 ఇప్పటివరకు వచ్చిన అన్ని మోడళ్లతో పోల్చితే మరింత శక్తివంతమైనది, ముఖ్యంగా కోడింగ్, డేటా విశ్లేషణ, సంక్లిష్ట సమస్యల విశ్లేషణ వంటి వాటిలో అద్భుతమైన పనితీరును చూపిస్తుందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుత ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇది మనుషుల జ్ఞానానికి తోడుగా పనిచేస్తూ, వేగవంతమైన పరిష్కారాలను అందిస్తూ, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, టెక్నాలజీ వంటి అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఇక ఈ క్రమంలో, AI రంగంలో అగ్రగామిగా నిలిచిన ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ తమ తదుపరి మోడల్ చాట్‌జీపీటీ‑5 (ChatGPT‑5)ను తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (CEO Sam Altman) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చాట్‌జీపీటీ-5 గత మోడళ్ల కంటే మెరుగైన ఫీచర్లు కలిగి ఉందని, ఇప్పటివరకు వచ్చిన అన్ని మోడళ్లతో పోల్చితే మరింత శక్తివంతమైనది, ముఖ్యంగా కోడింగ్, డేటా విశ్లేషణ, ఏజెంట్ టాస్కులు, సంక్లిష్ట సమస్యల విశ్లేషణ వంటి వాటిలో అద్భుతమైన పనితీరును చూపిస్తుందన్నారు. అలాగే, టెక్ట్స్‌తో పాటు ఫొటోలు, వీడియోలు, ఆడియోలను సైతం అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా సమాధానాలను ఇస్తుందన్నారు. ఈ మోడల్ తప్పు సమాచారం అవకాశాలను గణనీయంగా తగ్గించేలా రూపొందించబడిందని, దీనివల్ల ఇది మరింత విశ్వసనీయంగా ఉంటుందన్నారు.
ఇక భారత్‌లో ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, రానున్న రోజుల్లో భారతదేశం ఓపెన్ ఏఐకి అతిపెద్ద మార్కెట్‌గా మారే అవకాశం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వేగంగా అవలంబిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని, త్వరలో అమెరికాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచే సూచనలు ఉన్నాయని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. చాట్‌జీపీటీ‑5లో భారత భాషలకు కూడా మరింత మద్దతు కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా తను సెప్టెంబరులో ఇండియాలో పర్యటించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే, భారతదేశంలో తమ ఉత్పత్తులను అందించడంపై తమ సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.






