ఆ 3 విషయాల కోసమే Chat gpt ఎక్కువ వాడుతున్నారట..ఓపెన్ ఏఐ స్టడీలో కీలక విషయాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-16 13:07:29  IST  )

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏఐ చాట్‌బాట్‌లలో చాట్ జీపీటీ (Chat gpt) ఒకటి. కొన్ని వందల మిలియన్ల యూజర్లు చాట్ జీపీటీని వాడుతున్నారు. దీంతో రోజు రోజుకూ చాట్ జీపీటీ అప్డేట్ అవుతూనే ఉంది. చాట్ జీపీటీ కోడింగ్ (coding), ఇమేజ్ క్రియేషన్, కంటెంట్ రైటింగ్ తో పాటు పలు ముఖ్యమైన టాస్కుల కోసం ఉపయోగపడుతుంది.

ఆ 3 విషయాల కోసమే Chat gpt ఎక్కువ వాడుతున్నారట..ఓపెన్ ఏఐ స్టడీలో కీలక విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏఐ చాట్‌బాట్‌లలో చాట్ జీపీటీ (Chat gpt) ఒకటి. కొన్ని వందల మిలియన్ల యూజర్లు చాట్ జీపీటీని వాడుతున్నారు. దీంతో రోజు రోజుకూ చాట్ జీపీటీ అప్డేట్ అవుతూనే ఉంది. చాట్ జీపీటీ కోడింగ్ (coding), ఇమేజ్ క్రియేషన్, కంటెంట్ రైటింగ్ తో పాటు పలు ముఖ్యమైన టాస్కుల కోసం ఉపయోగపడుతుంది. చాట్ జీపీటీని ప్రధానంగా కోడింగ్ కోసం అనేక ప్రయోగాలు చేసి రూపొందించారు.

కానీ ఓపెన్ ఏఐ (open ai) యెక్క ఎకనామిక్ రీసెర్చ్ టీమ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రజలు కోడింగ్ కోసం కాకుండా 3 విషయాల కోసమే దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రశ్నలు అడగటం, ఏదైనా పనిని చేసిపెట్టాల‌ని కోర‌డం, టైమ్ పాస్ కోసం వాడ‌టం లాంటి అంశాలు ఉన్నాయి. కోడింగ్, ఇంటిలిజెన్స్ విషయాల కంటే ఎక్కువగా వీటికోసమే చాట్ జీపీటీ వాడుతున్నారట.

చాట్ జీపీటీతో దాదాపు 1.5 మిలియన్ల సంభాషణలను పరిశీలించి ఈ రిపోర్ట్ ఇచ్చారు.రిపోర్ట్ ఆధారంగా.. 49 శాతం మంది ఏదైనా ప‌ని ఎలా చేయాలి అని అడిగితే, 40 శాతం మంది ప‌నుల‌ను చేయ‌డానికి ఉప‌యోగిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఇమేజ్ క్రియేట్ చేయ‌డం, ఈమెల్స్ రాయ‌డం, రెస్యూమ్ క్రియేట్ చేయ‌డం, కంటెట్ రైటింగ్ లాంటివి. అంతే కాకుండా మ‌రో 11 శాతం మంది టైమ్ పాస్ కోస‌మే చాట్ జీపీటీ వినియోగిస్తున్నారు. వ్య‌క్తిగ‌త విష‌యాలు అడ‌గ‌టం, ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడిగి తెలుసుకోవ‌డం, ల‌వ్ మ‌రియు రొమాన్స్ లాంటి విష‌యాలు అడ‌గ‌టం లాంటివి చేస్తున్నార‌ట‌.

Next Story