- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై అది ఉంటేనే సేవలు
వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మెసేజింగ్ యాప్స్ కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ లో సిమ్ కార్డ్ ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది.

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మెసేజింగ్ యాప్స్ కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ లో సిమ్ కార్డ్ ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. తాజా ఆదేశాల ప్రకారం ఆయా సంస్థలు తదుపరి 90 రోజుల పాటు సిమ్ కార్డుతో అనుసంధానం అయ్యేలా చూసుకోవాలి. యూజర్ వెబ్ బ్రౌజర్ లో లాగిన్ అయినట్లు అయితే ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగ్ అవుట్ అయ్యేలా ఉండాలి.
తిరిగి లాగిన్ అవ్వాలి అంటూ మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. టెలికమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగం అవ్వకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నప్పుడు ఫోన్ లో సిమ్ ఉండాలి. తరవాత సిమ్ కార్డ్ తీసేసినా, డియాక్టివేట్ చేసినా సేవలు కొనసాగుతున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్లు యాప్స్ ను వినియోగిస్తున్నారు. అలా జరగకుండా ఉండేందుకు భద్రత కోసం సిమ్ కార్డ్ ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలని కేంద్రం ఆదేశించింది.






