- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New phone settings: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చడం తప్పనిసరి
New Phone Settings: మీరు కొత్త స్మార్ట్ ఫోన్(New smartphone) కొంటున్నారా?

దిశ, వెబ్ డెస్క్: New Phone Settings: మీరు కొత్త స్మార్ట్ ఫోన్(New smartphone) కొంటున్నారా? ముందుగా దానిలో సెట్టింగ్స్(New Phone Settings) సరి చేసుకోవాలి. చాలా మంది కొత్త ఫోన్ కొన్న వెంటనే ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ మార్చకుండా వాడితే ఫోన్ సేఫ్టీ(Phone Safety), పనితీరులో మార్పు ఉంటుంది. కొత్త ఫోన్ కొన్న వెంటనే మార్చాల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్(New Phone Settings) గురించి తెలుసుకుందాం.
1. మొదట మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచాలి. దీనికోసం సురీక్షితమైన, బలమైన స్క్రీన్ లాక్ ను సెట్ చేయాలి. కావాలంటే పిన్(pin), పాస్ వర్డ్(pass word), ప్యాటర్న్ లాక్(Pattern lock), ఫింగర్ ప్రింట్(Fingerprint) లేదా ఫేస్ అన్ లాక్(Face Unlock) రెండింటిలో ఏదొకదాన్ని ఎంచుకోవచ్చు.
2. అలాగే మీరు ఫైండ్ డివైజ్ ఫీచర్(Find Device feature) ను ఎనేబుల్ చేసుకోవచ్చు. తద్వారా మీరు మీ ఫోన్ కోల్పేతే దానిని గుర్తించవచ్చు. లేదా డేటాను తొలగించవచ్చు.
3. స్మార్ట్ ఫోన్ సురక్షితంగా మెరుగ్గా ఉంచేందుకు ఆటోమేటిక్ అప్ డేట్స్(Automatic updates) ను ఆన్ చేయడం చాలా ముఖ్యం. దీంతో ఫోన్లోని కొత్త సాఫ్ట్ వేర్, సెక్యూరిటీ ప్యాచ్ లు ఆటోమేటిక్ గా అప్ డేట్ అవుతాయి. ఇందుకోసం సెట్టింగ్స్ నుంచి సాఫ్ట్ వేర్ అప్ డేట్ విభాగానికి వెళ్లి సాఫ్ట్ వేర్ అప్ డేట్స్(Software updates) కోసం ఆటో అప్ డేట్స్ ను ఎనేబుల్ చేయాలి.
4. కొత్త ఫోన్లలో చాలా ప్రీ ఇన్ స్టాల్ చేసిన యాప్స్(Pre-installed apps) ఉంటాయి. వీటిని మీరు ఎప్పటికీ ఉపయోగించలేరు. ఈ యాప్స్ ఫోన్ స్టోరేజీ(Apps phone storage), బ్యాటరీని వినియోగిస్తాయి. ఇది కాకుండా బ్యాటరీ లేదా స్టోరేజీ సెట్టింగ్స్(Battery or storage settings) లోకి వెళ్లిన తర్వాత ఏయే యాప్స్ ఎక్కువ బ్యాటరీ, స్టోరేజీ స్పేస్(Storage space) ను ఉపయోగిస్తున్నాయో కూడా చెక్ చేసుకోవాలి.
5. ఫోన్ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించడానికి, బ్యాటరీ సేవర్ మోడ్(Battery saver mode) ను ఆన్ చేయాలి. ఎక్కువ బ్యాటరీని వినియోగించే యాప్స్ బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీ(Apps background activity)ని పరిమితం చేయాలి.






