BSNL : బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ !

by Y. Venkata Narasimha Reddy |

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) ప్రైవేటు కంపనీలకు గట్టిపోటీ ఇచ్చే క్రమంలో అదిరి పోయే ఆఫర్లతో మొబైల్ వినియోగదారులను ఆకర్షిస్తుంది.

BSNL : బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) ప్రైవేటు కంపనీలకు గట్టిపోటీ ఇచ్చే క్రమంలో అదిరి పోయే ఆఫర్లతో మొబైల్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాను(Cheap And Best Recharge Plan)లో చౌక గా అందిస్తున్న రూ.108రోజుల ప్లాన్ కు వినియోగదారుల నుంచి భారీ స్పందన కనిపిస్తు్ంది. 108 రూపాయల ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 1GB డేటాను 60రోజుల పాటు పొందుతారు. అంటే మొత్తం 60GB డేటా వస్తుంది. ఇది ఇంటర్నెట్ సేవలను తరచుగా ఉపయోగించే వారికి మంచి ఆప్షన్ గా చెబుతున్నారు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందుతారు.

అంటే వినియోగదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంత కాలం మాట్లాడినా అదనంగా ఛార్జీలు ఉండవు. దీంతోపాటు మీరు 500 SMSలను కూడా పొందవచ్చు. ఇవి 60 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. మీరు 1GB డేటా పూర్తి చేశాక కూడా మీరు ఎలాంటి అధిక ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్‌లో డేటా ఛార్జీలు ప్రతి MBకి మీకు సగటున రూ. 0.25 మాత్రమే అవుతుంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చితే ఈ ప్లాన్ చాలా బెటర్ అని చెబుతున్నారు నిపుణులు. ఇతర కంపెనీలు ఇంత చౌక ధరల్లో ఒక్క ప్లాన్ కూడా అమలు చేయకపోవడంతో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ క్రేజీగా మారింది.

దీంతో అనేక మంది యూజర్లు ఈ ప్లాన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్(BSNL) నెట్ వర్క్ విస్తరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ చౌక అయిన ప్లాన్‌ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. మీకు మరిన్ని ప్లాన్స్ గురించి వివరాలు తెలియాలంటే మాత్రం బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ (https://www.bsnl.co.in/) సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.

దేశంలో ప్రస్తుతం భారత ప్రభుత్వ టెలికాం సంస్థ (BSNL ) హవా కొనసాగుతోంది. గతంలో భారీ నష్టాల పాలైన బీఎస్ఎన్ఎల్ మళ్లీ 17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే వినియోగదారులకు తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ మరింత మంది వినియోగదారులను పెంచుకునే దిశగా దూసుకెలుతుంది.

Next Story