కస్టమర్లకు BSNL కొత్త ప్లాన్‌

by velandi.Saikiran |

BSNL మరో కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ. 225 రీఛార్జ్ చేస్తే.. 2.5 GB హై స్పీడ్ డేటా అందించేందుకు ముందుకు వచ్చింది.

కస్టమర్లకు BSNL కొత్త ప్లాన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కస్టమర్లను పెంచుకునేందుకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తోంది. జియో, ఎయిర్ టెల్ కంపెనీలు ధ‌ర‌లు అమాంతం పెంచుతుంటే, సామాన్యులను టార్గెట్ చేస్తూ రకరకాల ఆఫర్లను తీసుకువస్తోంది BSNL. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ. 225 రీఛార్జ్ చేస్తే.. 2.5 GB హై స్పీడ్ డేటా అందించేందుకు ముందుకు వచ్చింది. 30 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ లో అన్ లిమిటెడ్ కాల్స్ కూడా అందిస్తున్నారు.

అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. రోజువారి డేటా పూర్తయితే, ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ప్రైవేట్ నెట్వర్క్ లతో పోలిస్తే తక్కువ ధరలో ఎక్కువ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది అన్నమాట. ముఖ్యంగా సెకండరీ సిమ్ కార్డుగా బీఎస్ఎన్ఎల్ వాడుతున్న వారికి.. తక్కువ ధరలో డేటా అవసరం ఉన్న వాళ్లకు ఈ ఆఫర్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాగా, ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం రోజుకు 2.5 జీబీ అంటే నెలకు 75 జీబీ అందిస్తున్నారన్నమాట.

Next Story