- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 485కే రోజుకు 2 జీబీ డేటా, 72 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్!
బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం తక్కువ ధరకే ఎక్కువ లాభం చేకూరేలా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకువచ్చింది. ప్రస్తుతం వినియోగదారులు అధిక ఛార్జీలతో ఇబ్బందిపడుతుండటంతో వారిని ఆకర్షించేందుకు రూ.485 ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు 2జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం తక్కువ ధరకే ఎక్కువ లాభం చేకూరేలా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకువచ్చింది. ప్రస్తుతం వినియోగదారులు అధిక ఛార్జీలతో ఇబ్బందిపడుతుండటంతో వారిని ఆకర్షించేందుకు రూ.485 ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు 2జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. అంతేకాకుండా అపరిమితమైన లోకల్ మరియు ఎస్టీడీ వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రతిరోజు 100 ఎస్ఎమ్ఎస్ లు పంపుకునే అవకాశం ఉంది. ప్రతిరోజు 2జీబీ డేటా ఇవ్వడంతో ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించేవారికి కూడా ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడనుంది.
2జీబీ డేటా పూర్తైన తరవాత కూడా 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చు. ఇది ప్రాథమిక మెసేజింగ్ యాప్స్ వినియోగించేందుకు ఉపయోగడపడవచ్చు. ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ నుండి చేసుకున్నట్లయితే మరో 2 శాతం అదనంతగా డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ గడువు 72 రోజులుగా కాగా ఇంత తక్కువలో జియో కానీ ఎయిర్ టెల్ లో కానీ ఎలాంటి ప్లాన్స్ అందుబాటులో లేవు. ఒకవేళ ఇంతపెద్దమొత్తంలో రీచార్జ్ చేసుకోలేనట్లతే వారికోసం ఇటీవల ప్రవేశపెట్టిన రూ.199కే మరో ప్లాన్ కూడా ఉంది. దీని వ్యాలిడిటీ 35 రోజులుగా కాగా ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 25 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది.






