Google chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. అప్ డేట్ చేసుకోకపోతే అంతే సంగతి!

by Yella Dhawani Reddy |

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Google chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. అప్ డేట్ చేసుకోకపోతే అంతే సంగతి!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు (Google) చెందిన సెర్చ్ ఇంజిన్ క్రోమ్ (Chrome) యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విండోస్ (Windows), మ్యాక్ (Mac), లైనక్స్‌లోని (Linux) క్రోమ్‌లో భద్రతాపరమైన లోపాలున్నట్లు గుర్తించింది. వెంటనే ఈ యూజర్లందరూ తమ క్రోమ్‌ను అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది. లేదంటే మీ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది.

సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In రెస్పాన్స్ టీమ్ ప్రకారం.. విండోస్, మ్యాక్ డివైజ్‌ల్లో 136.0.7103.113/.114, లైనెక్స్ కోసం 136.0.7103.113 కన్నా ముందు ఉన్న క్రోమ్ వెర్షన్‌లలో అనేక సెక్యూరిటీపరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాల కారణంగా ఆయా డివైస్‌లు సులభంగా హ్యాకర్ల అధీనంలోకి వెళ్లిపోతాయని, వాటిలోని సమాచారం హ్యాకర్ల పరమవుతుందని వివరించింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు వీలైనంత త్వరగా తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్ యూజర్లకు దీనివల్ల ఏమంత నష్టం ఉండకపోవచ్చని తెలిపింది.

మీ బ్రౌజర్ వెర్షన్‌ను ఈ విధంగా తెలుసుకోండి

* క్రోమ్ బ్రౌజర్‌లో కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

* సెట్టింగ్‌లుకి వెళ్లి, డ్రాప్-డౌన్ మెనులో కిందికి స్క్రోల్ చేయాలి.

* helpకి వెళ్లి About Google Chrome ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* తర్వాత, కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ గూగుల్ క్రోమ్ వెర్షన్ కనిపిస్తుంది.

క్రోమ్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి?

* ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి విండో టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

* డ్రాప్‌డౌన్ మెనులో helpకి వెళ్లి About Google Chrome ఎంచుకోవాలి.

* క్రోమ్ ఆటోమాటిక్‌గా అప్‌డేట్స్ కోసం చెక్ చేస్తుంది. ఏవైనా కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంటే ఇన్‌స్టాల్ చేస్తుంది.

* అప్‌డేట్ పూర్తయిన తర్వాత ఓసారి బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయాలి.

Next Story