- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలను మహరాణులు చేసే సూపర్ స్కీమ్.. ప్రతి నెల ఖాతాలోకి రూ.7వేలు
మహిళలు మహరాణులుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ భీమా సంస్థ LIC (life insurance corporation) సైతం మహిళల కోసం బీమా సఖి యోజన (bheema sakhi yojana) అనే పథకాన్ని తీసుకువచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మహిళలు మహరాణులుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ భీమా సంస్థ LIC (life insurance corporation) సైతం మహిళల కోసం బీమా సఖి యోజన (bheema sakhi yojana) అనే పథకాన్ని తీసుకువచ్చింది. మహిళలను ఎల్ఐసీ ఏజెంట్లుగా మార్చడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పథకంలో భాగంగా మహిళలు ఏజెంట్లుగా మారడానికి వారికి బీమా గురించి శిక్షణ ఇస్తారు. తరవాత వారి వారి కమ్యూనిటీల్లో బీమాపై అవగాహన కల్పించడం ద్వారా ఏజెంట్లుగా మారుతారు.
వారినే బీమా సఖీలు అని పిలుస్తారు. బీమా సఖీలు పాలసీలు చేయడం కోసం అవసరమైన ప్రచార ఏర్పాట్లను, సామాగ్రిని కూడా సంస్థవారే అందిస్తారు. ఏజెంట్లుగా ఎంపికైనవారికి మొదటి మూడు సంవత్సరాలు స్టైఫండ్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ నెలకు రూ.7వేల చొప్పున ప్రతినెలా స్టైఫండ్ అందుతుంది. సెకండ్ ఇయర్ మొదటి సంవత్సరం చేసిన పాలసీలలో కనీసం 65శాతం రెండవ సంవత్సరం కొనసాగాలి. మూడో సంవత్సరం ప్రతి నెల రూ.5వేల స్టైఫండ్ ఇస్తారు.
ఈ పథకంలో 18 నుండి 70 సంవత్సరాల వయసు గల మహిళలు చేరవచ్చు. అంతేకాకుండా కనీసం 10వ తరగతి చదువుకుని ఉండాలి. మహిళల కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు ఎఐసీలో ఉద్యోగం లేదా ఏజెంట్లుగా ఉన్నట్లయితే ఆ మహిళలు అనర్హులు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు సైతం అనర్హులే. ఇక ఈ పథకంలో చేరిన మహిళలు పాలసీలు చేసినట్లయితే వారి పర్ఫామెన్స్ బట్టి ఇంటెన్సివ్స్ సైతం పెరుగుతాయి. గతేడాది ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.






