- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samsung Galaxy S24 Ultraపై రూ. 55వేల భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎక్కడంటే?
దసరా, దీపావళి పండగల వేళ ఆన్ లైన్ మార్కెట్ లో ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో చాలా వస్తువులపై ధరలను తగ్గించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: దసరా, దీపావళి పండగల వేళ ఆన్ లైన్ మార్కెట్ లో ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో చాలా వస్తువులపై ధరలను తగ్గించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.రూ.1,29,999 కాగా ప్రస్తుతం దీనిని కేవలం రూ.74,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.55వేల భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
మరోవైపు ICICI క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం ద్వారా మరో రూ.2,249 డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రస్తుతం ఎక్కువ ధర గల ఫోన్లలో Samsung Galaxy S24 Ultra మంచి డిమాండ్ ఉన్న మొబైల్ కావడం విశేషం. ఈ ఫోన్, కెమెరా పర్ఫామెన్స్ లో ఐఫోన్ టాప్ మోడల్స్ తో పోటీ పడుతుండటంతో చాలా మంది దీనిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఈ ఫోన్ టైటానియం వైలెట్, టైటానియం గ్రే మరియు టైటానియం బ్లాక్ అనే మూడు రంగుల్లో లభిస్తోంది.
ఫోన్ వచ్చి ఏడాది అవుతున్నా దీనికి ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఇది Qualcomm Snapdragon 8 Sen 3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. అంతే కాకుండా 6.8 అంగుళాల LTPO AMOLED 2X డిస్ ప్లేను ఇది కలిగి ఉంది. ఈ మొబైల్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో 256జీబీ ఇంటర్నల్ మెమోరీ, 12GB RAM ఉండటంతో పాటు 200 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇందులో 5000mAhతో 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.






