- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Recharge Plans: తక్కువ ధర.. ఎక్కువ ప్రయోజనాలు..84 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
Recharge Plans: కొంతమందికి ప్రతినెలా రీఛార్జ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఏడాది, ఆరు నెలలకు సరిపడే రీఛార్జులు చేసేసుకుంటారు. మీరు కూడా అలాంటి రీఛార్జ్ ప్లాన్ కోసం సెర్చ్ చేస్తున్నారా. అయితేూ 84 రోజులపాటు వచ్చే ప్లాన్స్ కావాలనుకుంటే ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

Recharge Plans: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండు లేదా మూడు నెలలపాటు వచ్చేలా ఉండే రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) కోసం మీరు సెర్చ్ చేస్తున్నారా. అయితే తక్కువ ధరలో ప్లాన్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. జియో(Jio), ఎయిర్ టెల్(Airtel), వొడాఫోన్ ఐడియా(Vodafone-Idea), బీఎస్ఎన్ఎల్(BSNL) ప్రీపెయిడ్ ప్లాన్స్(Prepaid plans) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. ఇందులో ఏది బెస్ట్ చూద్దాం.
వొడాఫోన్-ఐడియా రూ. 509 ప్లాన్(Vodafone-Idea)
వొడాఫోన్ ఐడియా చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్.ఇది 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ధర, వ్యాలిడిటీ ప్రకారం ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు సుమారు 6 రూపాయలు వరకు ఉంటుంది. వినియోగదారులకు అన్ లిమిటెడ్ కాలింగ్(Unlimited calling), వన్ టైం 1000 ఎస్ఎంఎస్ లతో పాటు 6జీబీ బల్క్ డేటా కూడా లభిస్తుంది. ఇంత డేటా అయిపోయిన తర్వాత ఒక్కో ఎంబికి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎంఎస్ కోట ముగిసిన తర్వాత లోకల్ రూ.1, ఎస్డిటి ఎస్ఎంఎస్ కు 1.5 ఛార్జ్ చెల్లించాలి. ఈ ప్లాన్ లో ఎలాంటి అదనపు బెనిఫిట్స్ ఉండవు.
ఎయిర్ టెల్ రూ. 509 ప్లాన్(Airtel)
ఎయిర్ టెల్ నుంచి చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ధర, వ్యాలిడిటీ ప్రకారం ఈ ప్లాన్ లో రోజు వారు ఖర్చు సుమారు 6 రూపాయలు ఉంటుంది. వినియోగదారులకు అన్ లిమిటెడ్, కాలింగ్ 100 ఎస్ఎంఎస్ లతోపాటు 6gb బల్క్ డేటా కూడా లభిస్తుంది. ఇంత డేటా అయిపోయిన తర్వాత ఒక్కో ఎంబీకి 50 పైసలు చార్జ్ చేస్తారు. ఈ ప్లాన్ 5జీ వినియోగదారులకు అపరిమిత కాలింగ్ కు అనర్హులు. ఈ ప్లాన్ లో స్పాన్ కాల్స్, ఎస్ఎంఎస్ నుండి వార్నింగ్ ఎయిర్టెల్ యాప్, అపోలో 24/7 సర్కిల్, ఫ్రీ హాలో ట్యూన్స్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
బిఎస్ఎన్ఎల్ రూ. 628 ప్లాన్ (BSNL)
బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ వాలిడిటీ 80 రోజులు. రోజుకు 3gb డేటా అంటే మొత్తం 252జీబి రోజుకు 100 ఎస్ఎంఎస్ లతోపాటు అన్ని నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. రోజువారి డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్ కు తగ్గుతుంది
జియో రూ. 799 ప్లాన్(Jio)
ఇది జియో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్. 84 రోజులు ఈ ప్లాన్ వస్తుంది. ధర, వ్యాలిడిటీని బట్టి రోజు వారీ ఖర్చు 9.51 అవుతుంది. ఈ ప్లాన్ లో వినియోధారులు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు అన్ని నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాల్ లభిస్తుంది. రోజువారి డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ కు తగ్గుతుంది. ఈ ప్లాన్ లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది






