నెలకు రూ.1000 కడితే చేతికి రూ.5 లక్షలు.. మధ్య తరగతి కలలు సాకారం చేసే సూపర్ స్కీమ్ ఇదే!

by Ajay Maddhiboyina |

చాలా మంది తల్లి దండ్రులు పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో, వారి వివాహాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాదాపు ప్రతి తల్లిదండ్రలది అదే సమస్య. అయితే దాని నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజ‌న (sukanya samruddi yojana) అనే ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది.

నెలకు రూ.1000 కడితే చేతికి రూ.5 లక్షలు.. మధ్య తరగతి కలలు సాకారం చేసే సూపర్ స్కీమ్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది తల్లి దండ్రులు పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో, వారి వివాహాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాదాపు ప్రతి తల్లిదండ్రలది అదే సమస్య. అయితే దాని నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజ‌న (sukanya samruddi yojana) అనే ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. ఇది ఆడ‌పిల్ల‌ల ఆర్థిక భ‌ద్ర‌త కోసం తీసుకువ‌చ్చిన ప‌థ‌కం. ఈ స్కీమ్ లో త‌ల్లి దండ్రులు వారి కూతురు పేరుపై బ్యాంక్ ఖాతా తెరిచి అందులో డ‌బ్బును డిపాజిట్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే 21 సంవ‌త్స‌రాల త‌ర‌వాత ఒకే సారి పెద్ద మొత్తంలో పొంద‌వ‌చ్చు.

ఈ స్కీమ్ లో ఇచ్చే వ‌డ్డీ రేటు సాధార‌ణ బ్యాంకుల్లో వ‌చ్చేదానికంటే చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అంతే కాకుండా టాక్స్ ఫ్రీగా రిట‌ర్న్స్ వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కంలో 8.2 శాతం వ‌డ్డీ అందుతోంది. ఈ ప‌థ‌కంలో మీరు నెల‌కు రూ.1000 చొప్పున డిపాజిట్ చేసినా సంవ‌త్స‌రానికి రూ.12వేలు అవుతుంది. 15 సంవ‌త్స‌రాల‌లో మొత్తం పెట్టుబ‌డి రూ.1,80,000 అవుతుంది. దానిపై వ‌డ్డీ రూ.3,74,206 వ‌స్తుంది. ఇక అమ్మాయికి 21 ఏళ్లు వ‌చ్చిన త‌ర‌వాత మీరు మొత్తం రూ.5,54,206 రూపాయ‌లు పొంద‌వ‌చ్చు. కేవ‌లం రూ.250తో ఈ ప‌థ‌కం కోసం ఖాతాను తెర‌వ‌చ్చు.

దీనిని మీ స‌మీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్ర‌భుత్వ అనుమ‌తి ఉన్న బ్యాంకుల‌లో ప్రారంభించ‌వ‌చ్చు. అకౌంట్ తెరిచేందుకు కూతురు బ‌ర్త్ స‌ర్టిఫికెట్, త‌ల్లి దండ్రుల ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్, ఓట‌ర్ ఐడీ, పాన్ కార్డ్ లాంటివి, నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రం అవ‌స‌రం. ఒక కుటుంబంలో ఇద్ద‌రు కుమార్తెల పేర్ల‌తో మాత్ర‌మే ఖాతాలు ప్రారంభించ‌వ‌చ్చు. ఈ అకౌంట్ పూర్తిగా కుమార్తె పేరు పైనే ఉంటుంది. కానీ త‌ల్లి దండ్ర‌లు నామినీలుగా ఉండొచ్చు. అంతే కాకుండా ఈ అకౌంట్ 10 ఏళ్ల లోపు బాలిక‌ల పేర్ల మీద మాత్ర‌మే తీసే అవ‌కాశం ఉంటుంది. 18 ఏళ్లు నిండిన త‌ర‌వాత మొత్తంలో నుండి 50 శాతం డబ్బును విత్ డ్రా చేసుకునే అకాశం కూడా ఉంది.

Next Story