పోయిన ఓటర్ కార్డును పొందడం ఎలానో తెలుసా?

by Disha Web Desk 8 |
పోయిన ఓటర్ కార్డును పొందడం ఎలానో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఓటర్ ఐడీ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటు భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడి హక్కు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్‌ గుర్తింపు కార్డును అందిస్తోంది. ఈ కార్డు ఓటింగ్‌ సమయంలోనే కాకుండా చాలా సందర్భాల్లో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే కొంత మంది ఓటర్ కార్డు పొగొట్టుకుంటారు. దీంతో ఓటర్ ఐడీ కార్డు పోయింది, నేను మళ్లీ పొందలేనేమో అని బాధపడుతుంటారు. అయితే అలాంటి వారికే ఈ సమాచారం.ఓటర్ ఐడీ కార్డు పోతే బాధపడాల్సిన పనేలేదు, ఎందుకంటే పోయిన ఓటర్ కార్డును పొందేందుకు ఒక మార్గం ఉంది. అది ఎలా అంటే?

ఆన్ లైన్‌లో భారత ఎన్నికల సంఘం వెబ్ సైట్‌కు వెళ్లి అప్లికేషన్ ఇవ్వడం ద్వారా పోయిన ఓటర్ ఐడీ కార్డును ఈజీగా పొందవచ్చు. దీనికోసం ముదుగా గూగుల్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని టైప్‌ చేసి, “ఆన్‌లైన్ సర్వీసెస్” పై క్లిక్ చేయాలి. తర్వాత ఓటర్ ఐడీ కార్డు కోసం దరఖాస్తు అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేసి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి, ఆ తర్వాత మీ ఓటరు నమోదు సంఖ్య (VID) నమోదు చేసి, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. ఓటీపీని నమోదు చేయడంతో దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతోంది. అందులో మీకు అవసరమైన సమాచారన్ని నింపి, అవసరమైన పత్రాలు..పాస్‌పోర్ట్ సైజు ఫోటో,గుర్తింపు కార్డు కాపీ (ఉదా. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్,చిరునామా రుజువు .. విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్,

ఓటరు గుర్తింపు కార్డు పోగొట్టుకున్న ఫ్రూఫ్ పత్రాలను జతచేసి దరఖాస్తు సమర్పించాలి.ఇలా దరఖాస్తు ఇచ్చిన వారం పదిరోజుల్లో మళ్లీ మీ ఓటర్ ఐడీ కార్డు మీకు వస్తుంది


Next Story

Most Viewed