కాలిఫోర్నియాలో ఘనంగా Apple iOS 17 లాంచ్.. కొత్త ఫీచర్ల లిస్ట్ ఇదే!

by Disha Web Desk 17 |
కాలిఫోర్నియాలో ఘనంగా Apple iOS 17 లాంచ్.. కొత్త ఫీచర్ల లిస్ట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: Apple కంపెనీ ప్రతి ఏడాది నిర్వహించే వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2023) ఈవెంట్ కాలిఫోర్నియాలో ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌లో యాపిల్ తన iOS 17 వెర్షన్ ఫీచర్లను ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్ వెర్షన్‌లో చాలా ఫీచర్స్‌ను తెచ్చారు. ముఖ్యంగా దీనిలో స్టాండ్‌బై మోడ్‌, జర్నల్ యాప్‌, ఆఫ్‌లైన్ మ్యాప్స్ మొదలగునవి ఉన్నాయి.

స్టాండ్‌బై మోడ్‌ ఫీచర్ ద్వారా ఫోన్‌ను చార్జింగ్ పెట్టినప్పుడు స్క్రీన్‌ను స్మార్ట్ డిస్‌ప్లేగా మారుస్తుంది. ఫోన్‌ను క్లాక్ మాదిరిగా వాడుకోవచ్చు. ఐఫోన్‌ను ఒకవైపు తిప్పి పట్టుకోగానే అది ఆటోమెటిక్‌గా ఫుల్ డిస్‌ప్లే లాగా మారిపోయి క్లాక్ వాచ్ లాగా కనిపిస్తుంది.



* జర్నల్ యాప్ ద్వారా యూజర్లు తమ రోజువారీ చేసే పనులను, కార్యకలాపాలను దానిలో సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక డైరీ లాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఫొటోలు, వీడియోలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చేయబడుతంది.

* ఇంటర్‌నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్ ద్వారా కూడా మ్యాప్స్ వాడుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ కోసం ‘హే సిరి’ అనాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ‘సిరి’ అంటే సరిపోద్ది.

* ఫేస్‌టైమ్ యాప్‌లో కూడా కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. అవతలి వారికి ఆడియో/వీడియో కాల్స్ చేసినప్పుడు వారు లిఫ్ట్ చేయని సందర్బంలో ఆడియో/వీడియో మెసేజ్‌లను పంపించుకోవచ్చు. వీటికి అదనంగా రియాక్షన్స్ సైతం యాడ్ చేయవచ్చు.



* ఏ ఫొటో ద్వారా అయిన స్టిక్కర్లను తయారుచేసుకునే లైవ్ స్టిక్కర్ ఫీచర్ సైతం వచ్చింది. ఐమెసేజ్ ద్వారా లోకేషన్ షేరింగ్ ఫీచర్‌ను కూడా తెచ్చారు.

* ప్రక్కన ఉన్న ఐఫోన్ వినియోగదారులకు ‘ఎయిర్‌డ్రాప్’ ఫీచర్ ద్వారా పెద్ద పెద్ద ఫైల్స్, ఫోన్ నంబర్స్, ఈమెయిల్స్ షేర్ చేయవచ్చు.



* వాయిస్ మెయిల్ కోసం లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది.

iOS 17 వెర్షన్ విడుదల తేదీని ప్రకటించనప్పటికి సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. Apple నుంచి రాబోయే కొత్త ఫోన్లు అన్ని కూడా iOS 17 తో వచ్చే అవకాశం ఉంది. పాత ఫోన్లలో ఉన్న హర్డ్‌వేర్ ఆధారంగా కొన్ని ఫోన్లకు మాత్రమే కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.





Next Story

Most Viewed