Apple MacBook Air 2025‌పై భారీ డిస్కౌంట్.. దీని ప్రస్తుత ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో పలు వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ తో పాటు ల్యాప్ టాప్‌లపై సైతం ఆఫర్స్ ఉన్నాయి. కాగా అమెజాన్ లో ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 2025పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు.

Apple MacBook Air 2025‌పై భారీ డిస్కౌంట్.. దీని ప్రస్తుత ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో పలు వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ తో పాటు ల్యాప్ టాప్‌లపై సైతం ఆఫర్స్ ఉన్నాయి. కాగా అమెజాన్ లో ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 2025పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ లాప్ టాప్ లాంచింగ్ ధర రూ.99.900 కాగా ప్రస్తుతం అమెజాన్ లో రూ.83,900 ఉంది. దీనిపై రూ.17,000 డిస్కౌంట్ లభిస్తోంది. అంతే కాకుండా క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ద్వారా మరో రూ.3,000 అదనంగా తగ్గుతుంది.

మొత్తం డిస్కౌంట్ తో ఇప్పుడు రూ.80,990కే ఈ ల్యాప్ టాప్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇది స్కై బ్లూ, సిల్వర్ మరియు మిడ్ నైట్ అనే రంగుల్లో లభిస్తోంది. ఆపిల్ మ్యాక్ బుక్ తీసుకోవాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ మ్యాక్ బుక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే... ఆపిల్ మ్యాక్ బుక్ 13.6 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ ప్లేను కలిగి ఉంది.

ఇందులో 16జీబీ యూనిఫైడ్ మెమరీ ఉంది. అంతే కాకుండా అవసరం అనుకుంటే దీనిని అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ లభిస్తుంది. ల్యాప్ టాప్ తో పాటు మీకు MagSafe 3 ఛార్జింగ్ పోర్టల్ సైతం లభిస్తుంది. అదే విధంగా ల్యాప్ టాప్ కు రెండు థండర్ బోల్ట్ 4 USB-C పోర్ట్‌లు, USB 4 మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఒకవేళ మీరు మ్యాక్ బుక్ తీసుకోవాలని అనుకుంటే ఇదే మంచి సమయం కాబట్టి త్వరపడండి.

Next Story