Apple: యాపిల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. కొత్త యాప్‌తో హోమ్‌ డెలివరీతో పాటు ఎన్నో సర్వీసులు

by Vennela |

Apple Store: యాపిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు స్టోర్‎కు వెళ్లాల్సిన అవసరం లేదు. స్టోరే మీ ఇంటికి తీసుకోస్తుంది కంపెనీ. యాపిల్ కస్టమర్ల కోసం భారత్ యాపిల్ స్టోర్ యాప్‎ను ప్రారంభించింది.

Apple: యాపిల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. కొత్త యాప్‌తో హోమ్‌ డెలివరీతో పాటు ఎన్నో సర్వీసులు
X

దిశ, వెబ్ డెస్క్: Apple Store: టెక్ దిగ్గజం యాపిల్(Apple) భారత్ లో తన కొత్త యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది. ఇప్పటికే రిటైల్ స్టోర్లను పెంచుకున్న ఈ సంస్థ తాజాగా దేశంలోని యూజర్ల కోసం కొత్త యాప్(Apple Store App) ను విడుదల చేసింది. యాపిల్ సర్వీసులు(Apple Services), ఉత్పత్తులు కొనుగోలు(Buy products) చేసేందుకు కస్టమర్ల కోసం ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. యాపిల్ స్టోర్ లో ఇప్పటికే యాప్ అందుబాటులో ఉందని ప్రకటించింది.

యాపిల్ భారత్ లో తన విక్రయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తన ఉత్పత్తులను మరింతమందికి చేరువ చేసే ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగానే చిన్న పట్టణాల్లో తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ యాప్ ( Apple Store App)తీసుకువచ్చింది. ఇప్పటికే ఇతర దేశాల్లో అందబాటులో ఉన్న ఈ యాప్ ను తాజాగా భారతదేశంలోని యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ స్టోర్ యాప్ లో ఎన్నో సర్వీసులను పరిచయం చేసింది. యాపిల్ ట్రేడ్ ఇన్(Apple Trade In), ఫైనాన్సింగ్ ఆప్షన్(Financing option) వంటి కీలకమైన రిటైల్ ప్రోగ్రామ్స్(Retail Programs) గురించి తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ప్రొడక్టులు, రిటైల్ ప్రోగ్రామ్స్ గురించి అప్ డేట్స్ అందుతాయి. యాపిల్ ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ, లేదా పికప్ సర్వీసులను కూడా అందిస్తుంది. కంపెనీకి సంబంధించి కొత్త ప్రొడక్ట్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వినియోగం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలనుకున్నా యాప్ లోని (Go Further) ట్యాబ్ సహాయంతో నిపుణులను సంప్రదించవచ్చు. కస్టమర్లు తమ మ్యాక్ లో మరింత పవర్ ఫుల్ చిప్, ఎక్స్‌ట్రా స్టోరేజీ కావాలంటే తమకు నచ్చినట్లు మార్చుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది. దీనితోపాటు ఎయిర్‌పాడ్‌(AirPods)లు, ఐప్యాడ్‌(iPads)లు, ఎయిర్‌ట్యాగ్‌(AirTags)లు, యాపిల్ పెన్సిల్‌(Apple Pencil)పై చెక్కిన ఏదైనా టెక్స్ట్ లేజర్‌(Text laser)ను అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. రాబోయే కాలంలో, ఈ యాప్ ద్వారా డిజిటల్ గిఫ్ట్ మెసేజ్‌(Digital gift message)లను కస్టమైజ్ చేసే ఆప్షన్‌ను కూడా అందించాలని కంపెనీ పరిశీలిస్తోంది.

ఇక భారత్ లో యాపిల్ యూజర్లకు షాపింగ్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపరిచేందుకు యాపిల్ స్టోర్ యాప్ తీసుకువచ్చామని రిటైల్ ఆన్ లైన్ హెడ్ కారెన్ రాస్ముసేన్ తెలిపారు. కొత్త అప్లికేషన్ లాంచ్ చేయడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఇక 2017లోనే యాపిల్ భారత్ లో ఐఫోన్ల తయారీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2023 ఏప్రిల్ లోనే ఢిల్లీ, ముంబై లో రెండు రిటైల్ స్టోర్లను కూడా ప్రారంభించింది. ఈ స్టోర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.

Next Story