- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్!
ప్రముఖ టెక్ సంస్థ మెటాకు చెందిన వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన వాట్సాప్ (Whatsapp) మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు బిలియన్ల యూజర్లు ఉన్నారు. అందుకే తన యూజర్లకు మరింత సౌకర్యావంతమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను (New Feature) అందించడంలో ముందుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను తీసుకురానుంది. వాట్సప్‌లో ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో రియల్-టైమ్ వాయిస్ చాట్‌ను అందించనుంది. దీని ద్వారా మెటా ఏఐతో లైవ్ వాయిస్ చాట్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
ఆండ్రాయిడ్ యూజర్లు చాట్ స్క్రీన్‌లో వేవ్‌ఫార్మ్ ఐకాన్‌పై క్లిక్ చేసిన తర్వాత మెటాతో పరస్పర వాయిస్ చాట్ చేయొచ్చు. లేదంటే సెట్టింగ్స్‌లోని వాయిస్ ప్రిఫెరెన్సెస్ సెక్షన్‌కు వెళ్లి వాయిస్ మోడ్‌ను యాక్టివేట్ చేయాలి. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్ చేసి ఉంటుంది. రియల్ టైమ్ వాయిస్ చాట్ ఫీచర్ కేవలం చాట్ ట్యాబ్ వరకే పరిమితమై ఉంటుంది. వినియోగదారులు కాల్ ట్యాబ్‌కు వెళ్లినపుడు మెటా ఏఐ ఐకాన్ ఆటోమేటిక్‌గా వేవ్‌ఫార్మ్ సింబల్‌గా మారుతుంది. దీంతో డీఫాల్ట్‌గా వాయిస్ చాట్‌బాట్‌లా పనిచేస్తుంది. వాయిస్ మోడ్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌పై కొన్ని టాపిక్స్ కనిపిస్తాయి. వినియోగదారులు వాయిస్ చాట్‌ను ప్రారంభించేందుకు వీటిని ఉపయోగించొచ్చు.






