వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇకపై వారికి ఈజీగా కాల్స్ చేయొచ్చు

by Yella Dhawani Reddy |

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ గురించి తెలియని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు.

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇకపై వారికి ఈజీగా కాల్స్ చేయొచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ గురించి తెలియని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఇక వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తాజాగా iOS యూజర్ల కోసం ఒక కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మరింత సులభంగా కాల్స్ చేయగలుగుతారు.

వాట్సాప్‌లో ఇప్పటివరకు మన ఫోన్ కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్లకు కాల్ చేయడం కుదరకపోయేది. కానీ, ఈ కొత్త ఫీచర్‌తో ఇది మరింత సులభం కానుంది. వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లో మూడు ముఖ్యమైన షార్ట్‌కట్స్ ఉన్నాయి. కొత్త కాల్ చేయడం, కాల్ లింక్ క్రియేట్ చేయడం, మాన్యువల్‌గా ఫోన్ నంబర్ ఎంటర్ చేయడం (ఇది ఈ అప్‌డేట్‌కు ముఖ్యమైన ఫీచర్)ని జోడించారు. ఇందులో మూడో ఆప్షన్ ద్వారా ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని నంబర్‌కు కూడా డైరెక్ట్‌గా కాల్ చేయవచ్చు. ఇది వాట్సాప్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక iOS యూజర్లు కాల్స్ ట్యాబ్‌లో ఉన్న '+' గుర్తుపై నొక్కితే, 'డయల్ నంబర్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా నేరుగా ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, కాల్ చేయవచ్చు లేదా చాట్ ప్రారంభించవచ్చు. అయితే ప్రస్తుతం ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ అందరూ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ మాతృసంస్థ బీటా తెలిపింది. ఒక వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్ ద్వారా యూజర్లు మరింత సులభమైన, వేగవంతమైన కాలింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

Next Story