- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. చదివిన 15 నిమిషాల్లోనే మెసేజ్ మాయం!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల ప్రైవసీని మరింత పెంచే దిశగా మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్ల ప్రైవసీని మరింత పెంచే దిశగా మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఉన్న ‘డిస్‌అప్పియరింగ్ మెసేజెస్’ (Disappearing Messages) కు అదనంగా ‘ఆఫ్టర్ రీడింగ్’ (After reading) అనే కొత్త ఆప్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా మీరు పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి చదివిన కేవలం 15 నిమిషాల్లోనే అది ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది.
ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేశాక, మీరు పంపిన మెసేజ్‌ను రిసీవర్ ఓపెన్ చేసిన వెంటనే 15 నిమిషాల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. ఆ సమయం ముగియగానే, పంపిన వారి (Sender), అందుకున్న వారి (Receiver) ఇద్దరి చాట్‌ల నుంచి ఆ మెసేజ్ శాశ్వతంగా తొలగిపోతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి ఆ మెసేజ్‌ను ఓపెన్ చేయకపోతే, అది 24 గంటల పాటు అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా సిస్టమ్ దాన్ని డిలీట్ చేస్తుంది. చాలామంది తమకు మెసేజ్ చదివినట్లు అవతలి వారికి తెలియకుండా ‘రీడ్ రిసిప్ట్స్’ (బ్లూ టిక్స్) ఆఫ్ చేసి పెట్టుకుంటారు. అయితే, ఈ కొత్త ఫీచర్ బ్లూ టిక్స్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పనిచేస్తుందని సమాచారం.
సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా..
మెసేజ్ ఓపెన్ చేయగానే వాట్సాప్ సిస్టమ్ దాన్ని ట్రాక్ చేసి 15 నిమిషాల కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ‘డిస్‌అప్పియరింగ్’ మెసేజెస్ కింద 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫోటోలు, వీడియోల కోసం ‘వ్యూ వన్స్’ (View Once) ఆప్షన్ ఉంది. అయితే, వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTP), బ్యాంక్ వివరాలు, ఇతర రహస్యమైన, సున్నితమైన సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో షేర్ చేసినప్పుడు, అవి 24 గంటల పాటు చాట్‌లో ఉండటం సురక్షితం కాకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఈ 15 నిమిషాల టైమర్ యూజర్ల డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా అడ్డుకుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
యూజర్లు తమకు నచ్చినట్లుగా ఈ ఫీచర్‌ను ఒక నిర్దిష్టమైన చాట్‌కు మాత్రమే కాకుండా, అన్ని కాంటాక్ట్స్ (Global settings) కు కూడా అప్లై చేసుకునే సదుపాయం ఉండనుంది. ఈ ‘ఆఫ్టర్ రీడింగ్’ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.12.2 అప్‌డేట్‌లో వాబేటాఇన్ఫో (WABetaInfo) సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ధి దశలోనే (Under development) ఉందని తెలుస్తోంది. బీటా టెస్టర్లకు కూడా ఇది పూర్తిగా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే రాబోయే కొత్త అప్‌డేట్స్‌లో వాట్సాప్ ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.






