ఆండ్రాయిడ్‌ 16 వచ్చేస్తోంది.. ముందుగా ఏ ఏ ఫోన్లలో అందుబాటులో ఉంటుందంటే?

by Yella Dhawani Reddy |

ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఆండ్రాయిడ్‌ 16 వచ్చేస్తోంది.. ముందుగా ఏ ఏ ఫోన్లలో అందుబాటులో ఉంటుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఆండ్రాయిడ్ (Android) వినియోగదారులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది అక్టోబర్‌లో ఆండ్రాయిడ్ 15ను పరిచయం చేసిన సంస్థ.. తాజాగా అప్‌డేటేట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 16ను విడుదల చేయబోతోంది. దీనిని గూగుల్ మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ అని పిలిచింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ షోలో అధికారికంగా ప్రవేశపెట్టబడిన దీనిని.. జూన్ నెలలో గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లల్లో (SmartPhone) విడుదల చేయనుంది. ఇక ఆండ్రాయిడ్ 16 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ ఇంత త్వరగా ఆండ్రాయిడ్ స్థిరమైన వెర్షన్‌ను విడుదల చేయడం ఇదే మొదటిసారి. సాధారణంగా సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో స్థిరమైన Android OSని పరిచయం చేస్తుంది.

ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్ ఏ ఏ ఫోన్లకు ముందుగా వస్తుందంటే?

ఆండ్రాయిడ్ 16 ప్రారంభ దశలో కంపెనీ మొదట దీన్ని గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు విడుదల చేయనుంది. ఇక ఇందులో పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6a, పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7a, పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8ఎ, పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9ఎ ఫోన్లలో అందుబాటులోకి రానుంది. అనంతరం శామ్‌సంగ్ ప్రీమియం సిరీస్ ఫోన్‌లు కూడా ఆండ్రాయిడ్ 16కి సపోర్టు చేయనుంది. శామ్‌సంగ్ ఫోన్‌లలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్ (గెలాక్సీ ఎస్ 25, ఎస్ 25 ప్లస్, ఎస్ 25 అల్ట్రా, ఎస్ 25 ఎడ్జ్), గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఉన్నాయి. ఇంకా, గెలాక్సీ ఎస్ 24 సిరీస్ (గెలాక్సీ ఎస్ 24, గెలాక్సీ ఎస్ 24 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా) ఈ ఏడాది 4వ త్రైమాసికం నాటికి అప్‌డేట్‌ను అందుకుంటాయి.

Next Story