- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైమ్ యూజర్స్ ఊహించని షాక్..యాడ్స్ పై కీలక నిర్ణయం!
ఉచితంగానే లభిస్తున్న అమెజాన్ మ్యూజిక్ లో ఇకపై యాడ్స్ రాబోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రైమ్ యూజర్లకు అమెజాన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇన్ని రోజుల పాటు ఉచితంగానే లభిస్తున్న అమెజాన్ మ్యూజిక్ లో ఇకపై యాడ్స్ రాబోతున్నాయి. ఒకవేళ యాడ్ ఫ్రీ మ్యూజిక్, ఆఫ్ లైన్ డౌన్లోడ్, ప్రీమియం క్వాలిటీ ఆడియో కావాలనుకునే డబ్బులు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. దీని కోసం అమెజాన్ మ్యూజిక్ అండ్ లిమిటెడ్ పేరుతో కొత్త ప్లాన్ కూడా తీసుకువచ్చారు.
అమెజాన్ మ్యూజిక్ అన్ లిమిటెడ్ అనేది ఒక పెయిడ్ ప్లాన్. ఇందులో ప్రీమియం మ్యూజిక్, హై ఆడియో క్వాలిటీ ఫీచర్స్ ఉంటాయి. 100 మిలియన్ పాటలు, డాల్బీ అట్మాస్, అల్ట్రా హెచ్ డీ, స్పెషల్ ఆడియో ఇలాంటి ఫీచర్స్ కూడా ఈ ప్లాన్ కింద వస్తాయి. ఇందు కోసం ప్రైమ్ యూజర్లు నెలకు 100 రూపాయలతో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. నాన్ ప్రైమ్ యూజర్లు రూ.119 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం ఈ ప్లాన్ ప్రైమ్ యూజర్లకు ఆరు నెలల పాటు ఉచితంగానే అందిస్తున్నారు.






