- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HDFC ఖాతాదారులకు అలర్ట్.. రేపు అర్దరాత్రి తరవాత యూపీఐ సహా ఆ సేవలన్నీ నిలిపివేత!
రేపు అర్ధరాత్రి తరవాత బ్యాంకింగ్ (ONLINE BANKING) సేవలకు అంతరాయం కలుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC BANK) ప్రకటించింది. షెడ్యూల్డ్ మెయింటెన్స్ కారణంగా శుక్రవారం అర్ధరాత్రి తరవాత అంటే శనివారం 12:30 AM నుండి ఉదయం 7:30 వరకు పలు సేవలు నిలిచిపోనున్నాయని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: రేపు అర్ధరాత్రి తరవాత బ్యాంకింగ్ (ONLINE BANKING) సేవలకు అంతరాయం కలుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC BANK) ప్రకటించింది. షెడ్యూల్డ్ మెయింటెన్స్ కారణంగా శుక్రవారం అర్ధరాత్రి తరవాత అంటే శనివారం 12:30 AM నుండి ఉదయం 7:30 వరకు పలు సేవలు నిలిచిపోనున్నాయని పేర్కొంది. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించేందుకు తమ ప్రయత్నం అని తెలిపింది. కాబట్టి కస్టమర్లు సహకరించాలని కోరింది.
అంతే కాకుండా ఎవరికైనా అత్యవసరం అయితే ముందుగానే పే జాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వ్యాలెట్‌లోకి డబ్బులు లోడ్ చేసుకోవాలని సూచించింది. యూపీఐ సేవలతో పాటు అన్ని రకాల ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నట్టు స్పష్టం చేసింది. అయితే ఏటీఎం సేవలు మాత్రం అందుబాటులో ఉండనున్నాయి. కావాల్సిన వాళ్లు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు, ఇతర ఏటీఎం సేవలు సైతం అందుబాటులో ఉంటాయి. మరియు క్రెడిట్ కార్డ్ సేవలకు సైతం ఎలాంటి అంతరాయం ఉండదని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది.






