- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AC రన్ అవుతున్నా..రూమ్ కూల్ అవ్వట్లేదా? అయితే టిప్స్ పాటించండి !
AC రన్ అవుతున్నా..రూమ్ కూల్ కాకపోతే కొన్ని టిప్స్ పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

దిశ, వెబ్ డెస్క్: ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో నిత్యం 45కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు బయటకు ఎవరు రావడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎండాకాలం నేపథ్యంలో కొంతమంది కూలర్లు పెట్టుకుంటే.. మరికొంతమంది ఏసీలు వినియోగిస్తున్నారు. అయితే ఏసీలు రన్ అవుతున్నప్పటికీ కొన్నిసార్లు రూమ్ అస్సలు కూల్ కాదు. అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందని టెక్నీషియన్స్ చెబుతున్నారు.
ఏసీ ఆన్ చేసినప్పటికీ చల్లగా రాకపోతే... ఫిల్టర్లలో మురికి ఉండే అవకాశం ఉంటుంది. లేదా గ్యాస్ లీక్ అయిన కావచ్చు. థర్మో స్టాట్ సెట్టింగ్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు టెక్నీషియన్స్. అదే సమయంలో అవుట్ డోర్ యూనిట్ దగ్గర చెత్తాచెదారం లేకుండా చూడాలని ఏసీ టెక్నీషియన్స్ సూచనలు చేస్తున్నారు.
కంప్రెసర్ ఫాల్ట్ ఉంటే, లేదా గది సైజుకు తగ్గ ఏసీ లేకపోయినా కూడా కూలింగ్ ఉండదని చెబుతున్నారు. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాయిల్స్ పైన మంచి పేరుకు పోతే వెంటనే సర్వీసింగ్ చేయించాలని చెబుతున్నారు. డక్స్ లీక్ కాకుండా ఇన్సులేషన్ పక్కగా ఉంటేనే, ఏసీ నుంచి కూలింగ్ వస్తుందని పేర్కొంటున్నారు. ఏసీ సర్వీసింగ్ చేయించేటప్పుడు సొంత తెలివి వాడకుండా కచ్చితంగా ఏసీ టెక్నీషియన్ ను పిలిపించి డబ్బులు ఖర్చైనా చేయించాలని సూచనలు చేస్తున్నారు.
- Tags
- AC
- room
- AC cooling






