ప్రపంచంలోనే మొట్టమొదటి 240W చార్జింగ్ స్మార్ట్ ఫోన్.. 10 నిమిషాల్లో ఫుల్ చార్జ్

by Disha Web Desk 17 |
ప్రపంచంలోనే మొట్టమొదటి 240W చార్జింగ్ స్మార్ట్ ఫోన్.. 10 నిమిషాల్లో ఫుల్ చార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: Realme కంపెనీ ఇటీవల జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో GT 3ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. కొత్త ‘Realme GT 3’ స్మార్ట్ ఫోన్ 8GB RAM + 128GB, 12GB RAM+256GB, 16GB RAM+256GB, 16GB RAM+512GB, 16GB RAM+1TB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఫోన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జింగ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ అని కంపెనీ పేర్కొంది. కేవలం 10 నిమిషాల్లో స్మార్ట్ ఫోన్ పూర్తి చార్జింగ్ అవుతుంది. ధర, లాంచ్ తేదీ వివరాలు త్వరలో కంపెనీ పేర్కొననుంది.


Realme GT 3 స్పెసిఫికేషన్స్

* 6.74-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే.

* 1,240×2,772 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో, 144Hz రిఫ్రెష్ రేట్‌.

* ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen SoC ద్వారా పనిచేస్తుంది.

* Realme UI 4.0తో Android 13లో రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 50MP సోనీ కెమెరా+8MP కెమెరా+ 2MP మైక్రో కెమెరాలు ఉన్నాయి.

* ముందువైపు 16 MP సెల్ఫీ కెమెరా ఉంది.


* గేమింగ్ కోసం X-యాక్సిస్ లీనియర్ మోటార్‌, కూలింగ్ సిస్టమ్ మ్యాక్స్ 2.0ని కలిగి ఉంటుంది.

* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇన్-డిస్ప్లే‌లో అందించారు.

* 240W ఫాస్ట్ చార్జింగ్‌తో 4,600mAh బ్యాటరీ ఉంది.

* ఇది బూస్టర్ బ్లాక్, పల్స్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.



Next Story

Most Viewed