మహిళ బాత్‌రూంలో ఉండగా.. టెక్నీషియన్‌ పాడు పని

by  |
woman in bathroom
X

దిశ, వెబ్‌డెస్క్ : నమ్మి ఇంటికి పిలిస్తే వక్రబుద్ధి చూపిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. విధి నిర్వహణను పక్కకు పెట్టి.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ల వృత్తికే మచ్చతెస్తున్నారు. తాజాగా టెక్నికల్ వర్క్ చేయడానికి వచ్చిన ఉద్యోగి ఓ మహిళ నగ్న వీడియోలను చిత్రీకరించడంతో స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బంజరాహిల్స్ రోడ్డు నంబర్-2లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఇంట్లో కేబుల్ నెట్‌వర్క్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆయన సదరు నెట్‌వర్క్‌కు ఫిర్యాదు చేయడంతో టెక్నీషియన్‌ను పంపించారు. అయితే తను పని చేయడానికి వచ్చిన ఇంటి పక్కనున్న ఓ మహిళపై టెక్నీషియన్‌ కన్నేశాడు. ఆమె కదలికలను గమనిస్తూ నెట్‌వర్క్ పనులు చేయసాగాడు. అదే సమయంలో మహిళ స్నానానికి వెళ్లడంతో అదే అదునుగా భావించిన టెక్నీషియన్‌ కిటికిలో నుంచి ఆమె బాత్ రూంలో ఉన్న నగ్న వీడియోలను చిత్రీకరించాడు.

అయితే టెక్నీషియన్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు అతడి మొబైల్‌ను పరిశీలించగా.. మహిళ బాత్ రూం నగ్న వీడియోలు బయటపడ్డాయి. దీంతో టెక్నీషియన్‌‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.

Next Story