చీరాలలో కీచక టీచర్.. స్కూల్‌లోనే..

by  |
Teacher sexual harassment of students
X

దిశ, వెబ్‌డెస్క్ : విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లేకి పనులకు పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు సస్పెండ్ అయినా బుద్ధి మారలేదు. పని చేసిన ప్రతి పాఠశాలలో చిన్నారులను లైంగికంగా వేధిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నాడు.

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న సురేష్ గత కొంత కాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అవసరం లేకున్నా టచ్ చేస్తూ, డబుల్ మీనింగ్ మాటలతో వేధిస్తున్నాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను అసభ్యంగా టచ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రోజురోజుకు సురేష్ వేధింపులు మితిమీరుతుండడంతో విద్యార్థినులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.

విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈపురుపాలెం ఎస్ఐ సుబ్బారావు స్కూల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు సురేష్ లైంగికంగా వేధించిండని తేలడంతో ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదిక అందజేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా, సురేష్ గతంలోనూ ఇలాగే ప్రవర్తించడంతో రెండుసార్లు సస్పెండ్ అయ్యాడని స్థానికులు చెబుతున్నారు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు కీచక టీచర్‌ను డిస్మిస్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

బడిలోనే బీరు, బిర్యానీ.. బట్టలు కూడా విప్పాలా? అని అడిగిన టీచర్


Next Story

Most Viewed