- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిలో శవమై తేలిన టీచర్
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన టీచర్ గోదావరిలో శవమై తేలాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని జనప్రియ నగర్‌కు చెందిన ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్.. బుధవారం నవిపేట్‌లో మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ కూతురు శ్రీవిద్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా శ్రీనివాస్ కారు, ఇతర […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన టీచర్ గోదావరిలో శవమై తేలాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని జనప్రియ నగర్‌కు చెందిన ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్.. బుధవారం నవిపేట్‌లో మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ కూతురు శ్రీవిద్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా శ్రీనివాస్ కారు, ఇతర వస్తువులు యంచ గోదావరి బ్రిడ్జి వద్ద గుర్తించారు. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయంల గోదావరిలో మృతదేహం లభ్యమైంది. శ్రీనివాస్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






