వారి కలను జగన్ చెల్లాచెదురు చేసేశారు- అచ్చెన్నాయుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-08 03:46:27  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: రాజధాని రైతులు 600 రోజులుగా అమరావతి కోసం చేస్తున్న పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల కలను జగన్ రెడ్డి చెల్లా చెదురు చేశారని విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తిరగబడాలని పిలుపు ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని సీఎం జగన్ చెప్పిన [&hellip;]</p>

వారి కలను జగన్ చెల్లాచెదురు చేసేశారు- అచ్చెన్నాయుడు
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని రైతులు 600 రోజులుగా అమరావతి కోసం చేస్తున్న పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల కలను జగన్ రెడ్డి చెల్లా చెదురు చేశారని విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తిరగబడాలని పిలుపు ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజధానికి కనీసం 30వేల ఎకరాలు తగ్గకుండా ఉండాలన్నారని, గొప్ప విజన్‌తో రూపొందించిన అమరావతిని ధ్వంసం చేయడానికి మనసెలావచ్చిందని అచ్చెన్నాయుడు నిలదీశారు. చర్చి, మసీదు, గుళ్ల నుండి మట్టిని తెచ్చి అమరావతికి శంకుస్థాపన చేస్తే.. దాన్ని అవమానించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల పోరాటానికి ప్రతిఫలం దక్కుతుందని..ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయమని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story