- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్ఆరే: పట్టాభిరామ్
<p>దిశ, ఏపీ బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది రాజశేఖర్ రెడ్డేనని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అక్రమ మైనింగ్‌కు తండ్రి బీజంవేస్తే కొడుకు అధికారంలోకి వచ్చాక దాన్నిపెంచి పెద్ద చేశాడు అని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో రెవెన్యూ రికార్డులను టాంపర్ చేసి లేని సర్వేనెంబర్ -143ను సృష్టించారని ఆరోపించారు. దానికింద […]</p>

దిశ, ఏపీ బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది రాజశేఖర్ రెడ్డేనని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అక్రమ మైనింగ్‌కు తండ్రి బీజంవేస్తే కొడుకు అధికారంలోకి వచ్చాక దాన్నిపెంచి పెద్ద చేశాడు అని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో రెవెన్యూ రికార్డులను టాంపర్ చేసి లేని సర్వేనెంబర్ -143ను సృష్టించారని ఆరోపించారు. దానికింద అక్రమ మైనింగ్ కోసం 216.25ఎకరాలను కేటాయించారని విమర్శించారు. సర్వే నెంబర్ 143 ఇంక్ పెన్నుతో రాసి సృష్టించిందేనని.. ఈ విషయాన్ని హైకోర్టు 27-12-2016లో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో హైకోర్టుతీర్పుకు లోబడి 2017లో చంద్రబాబు మైనింగ్ లీజులన్నీ రద్దు చేశారని చెప్పుకొచ్చారు.
టీడీపీ హయాంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూరన్తి సదరు సర్వే నెంబర్లలోని భూములను రెవెన్యూ భూములుగా పరిగణించలేదని తేల్చి చెప్పారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలోనే అటవీభూములను రెవెన్యూభూములుగా మార్చడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి, వసంతకృష్ణప్రసాద్ డైరెక్షన్‌లోనే అధికారులు అటవీభూములను 17-10-2019న రెవెన్యూ భూములుగా మార్చారని తెలిపారు.
చదువులేని బడుద్ధాయి, మైలవరం వీరప్పన్ వసంతకృష్ణప్రసాద్ కొండపల్లి మైనింగ్ కుసంబంధించి పచ్చి అబద్ధాలుచెప్పాడు. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైలవరం వీరప్పన్‌గా అభివర్ణించారు. మైలవరం వీరప్పన్ చదివింది పదోతరగతేనని…ఇంగ్లీషు చదవడం రాకపోతే ఎవరినైనా అడిగి చదివించుకొని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. అంతేగానీ ఏవో కాగితాలుచేతికి దొరికాయని చెప్పి, ఏదిపడితే అది మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. పదో తరగతి చదివిన బడుద్ధాయి, ఇంజనీరింగ్ చదివిన దేవినేని ఉమాని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తాడా? అంటూ మండిపడ్డారు.
ఉమా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాబట్టే..పోలవరం పనులను వేగంగా జరిపించి.. పట్టి సీమను సకాలంలో పూర్తి చేయించారని చెప్పుకొచ్చారు. తనపై సీబీఐ కేసుందని ఎన్నికల అఫిడవిట్‌లో కృష్ణప్రసాదే చెప్పాడని గుర్తు చేశారు. ఈడీ చార్జ్ షీట్లలో కూడా కృష్ణప్రసాద్ పేరుందని తెలిపారు. పొదిలి రవి అనే వ్యక్తిని మర్డర్ చేయించిన నీచ చరిత్ర కృష్ణప్రసాద్‌ది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కిరాయి గూండాలతో దేవినేనిపై హత్యాయత్నం చేయించాడని ఆరోపించారు. మర్డర్లు, లూఠీలు చేస్తున్న ఘనుడు వసంత కృష్ణప్రసాద్ అని అతడికి దేవినేని ఉమాని విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. కాలేజ్ గేటుముఖం కూడా చూడని కృష్ణప్రసాద్, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ పట్టభద్రుడైన లోకేశ్‌పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొనే గన్నేరుపప్పు దగ్గరకెళ్లి, కృష్ణప్రసాద్ నిరక్షరాస్యత అనే పదం పలికించమనండి చూద్దాం అంటూ పట్టాభిరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






