- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళ్లు, చేతులు కట్టేసి.. అడవిలో వదిలారు
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట కిడ్నాప్ కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సబ్బేళ్ల పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, కాళ్లు చేతులు కట్టి గోవిందపురం అడవిలో వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం అటుగా పశువులు మేపుకుంటూ వచ్చిన కాపర్లు శ్రీనివాస్‌ను గుర్తించి, గ్రామస్తులకు సమచారం అదించారు. వెంటనే అడవిలోకి వచ్చిన టీడీపీ నేతలు శ్రీనివాస్ రెడ్డిని గుర్తించి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట కిడ్నాప్ కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సబ్బేళ్ల పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, కాళ్లు చేతులు కట్టి గోవిందపురం అడవిలో వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం అటుగా పశువులు మేపుకుంటూ వచ్చిన కాపర్లు శ్రీనివాస్‌ను గుర్తించి, గ్రామస్తులకు సమచారం అదించారు. వెంటనే అడవిలోకి వచ్చిన టీడీపీ నేతలు శ్రీనివాస్ రెడ్డిని గుర్తించి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి భార్య స్పందిస్తూ.. టీడీపీ తరపున పోటీ చేస్తున్నామని అధికార పార్టీ వారు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా తమతో అధికార పార్టీ నేతలు.. మీరు ఓడిపోతారు పోటీ చేయకండి అని బెదిరిస్తున్నారని తెలిపారు. వారికి భయపడకుడా నామినేషన్ వేయడానికి సిద్ధపడ్డడంతో నా భర్తను కిడ్నాప్ చేశారని.. కానీ నామినేషన్ వేయకుండా తమని వారు అడ్డుకోలేకపోయారని అభ్యర్థి వెల్లడించారు.






