పండుగ రోజు అరెస్ట్ చేస్తారా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-03-10 22:23:08  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కొల్లు రవీంద్ర అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. వైసీపీ అక్రమాలను అడ్డుకున్న బీసీలను కేసులతో వేధిస్తారా? అంటూ ప్రశ్నించారు. కొల్లు రవీంద్రను వెంటనే విడుదల చేయాలని, సీఎం జగన్ బీసీ వ్యతిరేకి అని చంద్రబాబు ఆరోపించారు. బీసీలను పండగ రోజు కూడా సంతోషంగా ఉండనీయట్లేదని, దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పతాక [&hellip;]</p>

పండుగ రోజు అరెస్ట్ చేస్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కొల్లు రవీంద్ర అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. వైసీపీ అక్రమాలను అడ్డుకున్న బీసీలను కేసులతో వేధిస్తారా? అంటూ ప్రశ్నించారు. కొల్లు రవీంద్రను వెంటనే విడుదల చేయాలని, సీఎం జగన్ బీసీ వ్యతిరేకి అని చంద్రబాబు ఆరోపించారు.

బీసీలను పండగ రోజు కూడా సంతోషంగా ఉండనీయట్లేదని, దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయన్నారు.

ఇక అక్రమాలపై ప్రశ్నిస్తే తనను అరెస్ట్ చేస్తారా అంటూ కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఇదేమీ న్యాయమని ప్రశ్నిస్తే.. తమపైనే కేసు పెట్టారని, తెల్లవారుజామునే భారీగా పోలీసులు వచ్చారన్నారు.

Next Story