- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి పేరు వింటేనే జగన్ వణికిపోతున్నారు : నారా లోకేష్
<p>దిశ, ఏపీ బ్యూరో: అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.”ప్రజారాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యింది. జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వ్యానులలో కుక్కారు. సెల్‌లో బంధించారు. రైతుల కాళ్లు విరగ్గొట్టారు. మహిళల పట్ల మగపోలీసులు […]</p>

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.”ప్రజారాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యింది. జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వ్యానులలో కుక్కారు. సెల్‌లో బంధించారు. రైతుల కాళ్లు విరగ్గొట్టారు. మహిళల పట్ల మగపోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.
ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని నిర్బంధించారు. ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైళ్లలో బందీలైన రైతులు, మహిళలు, టీడీపీ నేతలు, ఉద్యమకారుల పోరాటానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. న్యాయమైన మీ పోరాటానిదే అంతిమ విజయం. అమరావతి శాశ్వతం” అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.






