టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి రామసుబ్బారెడ్డి?

by Vemula.Srinu Prasad |

<p>కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సీఎం జగన్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. వైసీపీలో చేరికపై రామసుబ్బారెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అన్ని కుదిరితే మరో మూడు రోజుల్లో జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. విషయం తెలుకున్న టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డిని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రామసుబ్బారెడ్డి చేరికపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అలక [&hellip;]</p>

టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి రామసుబ్బారెడ్డి?
X

కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సీఎం జగన్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. వైసీపీలో చేరికపై రామసుబ్బారెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అన్ని కుదిరితే మరో మూడు రోజుల్లో జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. విషయం తెలుకున్న టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డిని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రామసుబ్బారెడ్డి చేరికపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అలక వహించారు. అయితే జగన్ నిర్ణయం తీసుకోవడంతో సుధీర్‌రెడ్డి మౌనం వహించక తప్పలేదు.

tag; tdp leader, rama subba reddy, ycp, jagan

Next Story