దీక్షకు కూర్చుంటా.. టచ్ చేసి చూడు: దేవినేని

by  |
దీక్షకు కూర్చుంటా.. టచ్ చేసి చూడు: దేవినేని
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గొళ్లపూడిలో దేవినేని ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తానన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు సోమవారం రాత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా, సీఎం వస్తారో లేకుంటే కొడాలి నాని వస్తారో రండి అంటూ ఉమ సవాల్ విసిరారు. గొల్లపూడిలో దీక్షకు కూర్చుంటున్నా.. టచ్ చేసి చూడండి అంటూ మీడియా ముఖంగా కామెంట్లు చేశారు. పోరంబోకు మంత్రి మాటలకు ప్రజలే సమాధానం చెబుతారన్న దేవినేని ఉమ.. బాబాయ్‌ని ఎవరు చంపారో జగన్‌ను నిలదీసే దైర్యం మంత్రికి లేదన్నారు. ఉడుత ఊపుళ్లకు భయపడే జగన్.. హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారా అన్నారు.

Next Story