వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రశ్నించండి : చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-12-22 08:56:11  IST  )

<p>దిశ, ఏపీబ్యూరో : ఇరవై నెలల వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రజలు ప్రశ్నించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్​చార్జిలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడుతూ..ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయినట్లు చెప్పారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఎంతో మందిని ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలను నిలువుదోపిడీ చేస్తూ సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతుందన్నారు. గంటకో అత్యాచారం, పూటకో హత్యగా [&hellip;]</p>

వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రశ్నించండి : చంద్రబాబు
X

దిశ, ఏపీబ్యూరో : ఇరవై నెలల వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రజలు ప్రశ్నించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్​చార్జిలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడుతూ..ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయినట్లు చెప్పారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

ఎంతో మందిని ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలను నిలువుదోపిడీ చేస్తూ సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతుందన్నారు. గంటకో అత్యాచారం, పూటకో హత్యగా వైసీపీ పాలన కొనసాగుతుందని చెప్పారు. వీటిపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Next Story