- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే హత్యలు: అచ్చెన్నాయుడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని హత్యల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు అంకులును హత్య చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. హత్యలతో టీడీపీ కార్యకర్తలను జగన్ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్నా ఆరోపించారు. అంకులును హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. వైసీపీ అహంకారాన్ని, మదాన్ని దించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని మోకాళ్ల మీద నిలబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రశ్నిస్తే దాడులు.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని హత్యల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు అంకులును హత్య చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. హత్యలతో టీడీపీ కార్యకర్తలను జగన్ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్నా ఆరోపించారు. అంకులును హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. వైసీపీ అహంకారాన్ని, మదాన్ని దించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని మోకాళ్ల మీద నిలబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే హత్యలు చేసుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతా పారిస్తున్నారన్నారు.
Next Story






