హుజురాబాద్‌‌లో సత్తా చాటుతామంటోన్న టీడీపీ

by Vadlamudi Anukaran |

<p>దిశ, హుజూరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో సైకిల్ గుర్తు సత్తా చాటాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని.. మూడెకరాల భూమికి బదులు రూ. పది [&hellip;]</p>

హుజురాబాద్‌‌లో సత్తా చాటుతామంటోన్న టీడీపీ
X

దిశ, హుజూరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో సైకిల్ గుర్తు సత్తా చాటాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని.. మూడెకరాల భూమికి బదులు రూ. పది లక్షలు ఇచ్చి తప్పించుకుంటున్నారని సెటైర్లు వేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తాత్కాలిక పనులు చేస్తూ ప్రజలను మభ్య పెడుతోందన్నారు. ఇందుకు ఉదాహరణ సిరిసిల్ల నియోజకవర్గంలోని కలెక్టరేట్ భవనం అని పేర్కొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేస్తే వాళ్లు చేసే అన్యాయాలకు మద్దతు పలికినట్టే అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచ స్థాయికి చాటి చెప్పారని.. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఉప ఎన్నికలో టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.

Next Story