చెంప చెల్లుమనిపించిన బాలయ్య.. అభిమాని రియాక్షన్ ఇదే..!

by  |
balayya fan
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. నటుడిగా..టీడీపీ ఎమ్మెల్యేగా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలయ్య ఎన్నికల ప్రచారానికి వచ్చారంటే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే అనేదానికంటే ముందు ఆయనొక ఫేమస్ హీరో. తమ అభిమాన నటుడు తమ దగ్గరకు వచ్చేసరికి ఆయనతో ఓ సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు. మరికొంతమంది అయితే తమ అభిమాన నటుడు ఏం చెప్తున్నాడోనని ఆసక్తిగా వీడియో రికార్డు చేస్తుంటారు. అయితే బాలయ్య ముందు ఇలాంటి సాహసాలు చాలా డేంజర్.

అలాంటి పనులు చేస్తే బాలయ్యకు చిర్రెత్తుకొచ్చేస్తుంటుంది. ఫోన్లు పగిలిపోతాయ్. మెమెరీ కార్డులు సంగతి మరచిపోవాల్సిందే. ఇక చెంపల సంగతి సరే సరి. ఇప్పటికే బాలయ్య సెల్ఫీ కోసం ప్రయత్నించిన పలువురు అభిమానుల చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య ఓ ఇంట్లోకి వెళ్లారు. అక్కడ మాట్లాడుతుండగా టీడీపీ కార్యకర్త వీడియో తీశాడు. అది చూసిన బాలయ్య కోపంతో రగిలిపోయారు. గూబ గుయ్ మనిపించారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

అయితే బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న యువకుడు మాత్రం తన ఆసక్తికరంగా స్పందించాడు. బాలయ్య బాబు తనను టచ్ చేసినందుకు గర్వంగా ఉందంటూ ఆ యువకుడు ఓ వీడియో విడుదల చేశాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా బాలయ్య శ్రమిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మా అన్నయ్య ఇంటికి వచ్చారు. నేను ఎవరో తెలియక బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోశారు. అయినా ఇలాంటి వాటిని మాలాంటి ఎన్బీకే ఫ్యాన్స్ పట్టించుకోము. ప్రత్యర్థులు దీన్ని రాజకీయ కోణంలో చూస్తే వాళ్లంతటి మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. బాలయ్య బాబు టచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ దెబ్బలు తిన్న అభిమాని తెలిపాడు.


Next Story

Most Viewed