రెండేళ్లలో వాహన రంగంలో అనేక మార్పులు : టాటా ఛైర్మన్!

by  |
రెండేళ్లలో వాహన రంగంలో అనేక మార్పులు : టాటా ఛైర్మన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ రంగంలో రానున్న రెండేళ్లలో అనేక మార్పులు రానున్నట్లు అంచనా వేస్తున్నామని టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. కొవిడ్-19 ప్రభావంతో ప్రజలు ఎక్కువగా సొంత వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.. ఇది ఇంకా పుంజుకుంటుందా లేక ప్రజలు ప్రజా రవాణాను కొనసాగిస్తారా అనేది రానున్న కొన్ని నెలలపాటు పరిశీలించాల్సి ఉందని వివరించారు.

ప్రయాణీకుల నుంచి వాహనాలకు వచ్చే డిమాండ్‌ను బట్టి ఉంటుందని చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి స్పందించిన చంద్రశేఖరన్.. టాటా మోటార్స్ దేశీయ వ్యాపారం పునరుత్తేజం అవుతోంది, గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, కరోనా ప్రభావంతో ప్రతికూలంగా పరిస్థితులు మారాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ వృద్ధి నెమ్మదించడం, వాణిజ్య ఉద్రిక్తతలు వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చేసినట్లు చంద్రశేఖరన్ తెలిపారు. ఇటీవల పరిణామాల్లో డిజిటల్ అనుభవాలపై ఆసక్తి పెరిగిందని, ఆరోగ్య రక్షణ, భద్ర అంశాల పట్ల ప్రాధాన్యత ఎక్కువైందన్నారు. జనాలు ప్రయాణాలు తగ్గించుకోవడం రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం చూపిందని చంద్రశేఖరన్ తెలిపారు.


Next Story

Most Viewed