- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంఐఎం నేత ఇంట్లో దాడులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని భర్కత్ పుర కాలనీలోని ఎంఐఎం నేత ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. సీపీ కార్తీకేయ అదేశాల మేరకు సీఐ షాకీర్ ఆలీ, తన సిబ్బందితో కలిసి ఎంఐఎం నేత, వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ ఎన్ఆర్ఐ జావిద్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జావిద్పై కేసు నమోదు చేసినట్లు పోలీసుల […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని భర్కత్ పుర కాలనీలోని ఎంఐఎం నేత ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. సీపీ కార్తీకేయ అదేశాల మేరకు సీఐ షాకీర్ ఆలీ, తన సిబ్బందితో కలిసి ఎంఐఎం నేత, వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ ఎన్ఆర్ఐ జావిద్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జావిద్పై కేసు నమోదు చేసినట్లు పోలీసుల వెల్లడించారు.

ఇటీవల నిజామాబాద్లో గుట్కా విక్రయాల వ్యవహరంలో జావిద్ పేరు తెర మీదకు వచ్చినా.. స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. నగరంలో నిషేధిత గుట్కా, తంబాకు తయారీ విక్రయాల్లో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం నేతల హస్తం ఉందని మరోసారి బహిర్గతం అయ్యింది.
Next Story






