- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర విమాన ప్రమాదంలో స్టార్ హీరో దుర్మరణం.. షాక్ లో ఫ్యాన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికా లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జో లారా దుర్మరణం పాలయ్యారు. ‘టార్జన్’ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న జో లారా మృతిచెందడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానంలో జో లారా ఆయన భార్య గ్వెన్ షాంబ్లిన్ తోపాటు మరో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలోకి రాగానే అక్కడి సరస్సులో విమానం కూలిపోయింది.. ఈ ఘటన లో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జో లారా దుర్మరణం పాలయ్యారు. ‘టార్జన్’ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న జో లారా మృతిచెందడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానంలో జో లారా ఆయన భార్య గ్వెన్ షాంబ్లిన్ తోపాటు మరో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలోకి రాగానే అక్కడి సరస్సులో విమానం కూలిపోయింది.. ఈ ఘటన లో జో లారా తో పాటు మరో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ దుర్ఘటనలో శకలాలు చెల్లాచెదురు అయ్యాయని, సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న జో లారా అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.






