ఆ హోటల్‌లోనే తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ స్టార్ట్..

by Jakkula Samataha |

<p>దిశ, సినిమా : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ‘పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది?’ లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న ఆయన.. కెరియర్ తొలిరోజులు, పెళ్లి చూపులు సినిమా స్టోరీకి పునాదిపడిన కథను గుర్తుచేసుకున్నాడు. హైదరాబాద్ మారేడుపల్లిలోని హోటల్ హీరా మోతి, ఇరానీ చాయ్ కేఫ్‌లో సినిమా గురించి ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ మరిచిపోలేనని చెప్పాడు. ఇక్కడే తన ఫస్ట్ డైరెక్టోరియల్ ‘పెళ్లి [&hellip;]</p>

tarun-basker
X

దిశ, సినిమా : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ‘పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది?’ లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న ఆయన.. కెరియర్ తొలిరోజులు, పెళ్లి చూపులు సినిమా స్టోరీకి పునాదిపడిన కథను గుర్తుచేసుకున్నాడు.

హైదరాబాద్ మారేడుపల్లిలోని హోటల్ హీరా మోతి, ఇరానీ చాయ్ కేఫ్‌లో సినిమా గురించి ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ మరిచిపోలేనని చెప్పాడు. ఇక్కడే తన ఫస్ట్ డైరెక్టోరియల్ ‘పెళ్లి చూపులు’ సినిమా స్టోరీ మొదలైందని తెలిపాడు. ఈ హోటల్‌ను తన సేఫ్ స్పేస్‌గా అభివర్ణించాడు తరుణ్ భాస్కర్. కాగా విజయ్ దేవరకొండ, రీతూ వర్మ లీడ్ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఈ చిత్రాన్ని హీరో హరీశ్ కళ్యాణ్ తమిళ్‌లో రిమేక్ చేస్తున్నాడు.

Next Story