టారిఫ్ పెంపుతో టెలికాం కంపెనీల 5జీ పెట్టుబడుల వృద్ధికి అవకాశం: క్రిసిల్

by  |
5g
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం కంపెనీలు ఇటీవల తమ టారిఫ్ ధరలను పెంచడం ద్వారా నిర్వహణ లాభాలను కనీసం 40 శాతం పెంచుకునే అవకాశం ఉందని ఓ నివేదిక అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రభుత్వం బకాయిలపై మారటోరియం ఇచ్చిన నేపథ్యంలో 5జీ టెక్నాలజీ కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. టారిఫ్ పెరుగుదల, ప్రభుత్వం ఇచ్చిన వాయిదాతో టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం రూ. 1.5-1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) 20 శాతం పెరుగుదల వల్ల సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంతో పాటు సంస్థ నిర్వహణ లాభం మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.

ఇటీవల టారిఫ్ పెంపు, గత కొంతకాలంగా వినియోగదారుల వృద్ధితో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 135గా ఉన్న టెలికాం కంపెనీల ఆర్పు 20 శాతంతో రూ. 160-165కి చేరుకోవచ్చని’ క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితేష్ జైన్ అన్నారు. కాగా, గత వారం భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను 25 శాతం పెంచుతున్నట్టు ప్రకటించగా, రిలయన్స్ జియో డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్‌లను 21 శాతం పెంచింది.


Next Story

Most Viewed