- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది హాకీలో పనిష్మెంట్.. కానీ నాకు ఇష్టం: తాప్సీ
<p>లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం ఇంటికి పరిమితం అయింది. దీంతో టైమ్ దొరకడంతో నటి తాప్సీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది. రోజుకో పిక్ షేర్ చేస్తూ… అభిమానులతో జ్ఞాపకాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో “సూర్మ” సినిమా సెట్స్ నుంచి ఓ వీడియోను షేర్ చేసింది తాప్సీ. ఈ వీడియోలో హాకీ పిచ్ లో తాప్సీ పనిష్మెంట్ తీసుకోవడం చూడొచ్చు. కానీ ఈ పనిష్మెంట్ నా చిన్నతంలో ఒక ఆహ్లాదకరమైన చర్య అని తెలుపుతూ […]</p>

లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం ఇంటికి పరిమితం అయింది. దీంతో టైమ్ దొరకడంతో నటి తాప్సీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది. రోజుకో పిక్ షేర్ చేస్తూ… అభిమానులతో జ్ఞాపకాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో “సూర్మ” సినిమా సెట్స్ నుంచి ఓ వీడియోను షేర్ చేసింది తాప్సీ. ఈ వీడియోలో హాకీ పిచ్ లో తాప్సీ పనిష్మెంట్ తీసుకోవడం చూడొచ్చు. కానీ ఈ పనిష్మెంట్ నా చిన్నతంలో ఒక ఆహ్లాదకరమైన చర్య అని తెలుపుతూ ట్వీట్ చేసింది తాప్సీ.
హాకీలో సాధారణంగా ఆ శిక్షను బాజియాన్ అని పిలుస్తారు అని తెలిపిన తాప్సీ… దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు నా బాల్యం గుర్తొస్తుందని తెలిపింది. చిన్నతనంలో హైపర్ యాక్టివ్ గా ఉండే నేను “బాజియాన్ ” వేస్తూ ఎంజాయ్ చేసేదాన్ని అని చెప్పింది. అందుకే సూర్మ సెట్ లో సులభంగా చేయగలిగాను అని చెప్పింది. నేను ఒకవేళ క్లాస్ మిస్ అయితే కోచ్ సందీప్ ఈ పనిష్మెంట్ తో సిద్ధంగా ఉండేవారని తెలిపింది తాప్సీ.






