ఆ సినిమాతో ఎన్నో మ‌ధుర ఙ్ఞాప‌కాలు : తాప్సీ

by  |
ఆ సినిమాతో ఎన్నో మ‌ధుర ఙ్ఞాప‌కాలు : తాప్సీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ‘షూటర్ దాదీస్‌’గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సాండ్ కీ ఆంఖ్’.. తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో.. ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మించారు. గ‌తేడాది విడుద‌లైన ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్‌లుక్‌ను సోష‌ల్ మీడియా వేదికగా తాప్సీ పంచుకుంది. “నా కెరీర్లోనే నేను చేసిన అతిపెద్ద ప్ర‌యోగం ఇది. మొద‌టిసారి డైరెక్టర్గా తుషార్ హీరానందాని, తొలిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్లోనే మొద‌టిసారి ఇద్దరు హీరోయిన్లు వయసుకు మించిన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఎంతోమంది మొద‌టిసారిగా స్క్రీన్ పై త‌మ అదృష్టం ప‌రీక్షించుకున్నారు. ఈ సినిమాతో నాకెన్నో మ‌ధుర‌మైన ఙ్ఞాప‌కాలు ఉన్నాయి అంటూ తాప్సీ పోస్ట్ పెట్టింది.


Next Story

Most Viewed