తనుశ్రీ దత్తా కమింగ్ బ్యాక్..

by Jakkula Samataha |   (  Updated:2020-11-10 08:00:41  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : మీటూ ఉద్యమం తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైపోయిన తనుశ్రీ దత్తా.. రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన భామ.. కొందరు చెడు మనుషుల వల్ల నాకు నచ్చిన ఇండస్ట్రీకి, కళకు దూరం కావాలని అనుకోవడం లేదని, అందుకే మళ్లీ ఇండియాకు తిరిగొచ్చేసినట్లు తెలిపింది. తనకు బాలీవుడ్‌పై సదాభిప్రాయం ఉందన్న ఆమె.. ఇక్కడే ఉండి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లు చేస్తానని చెప్పింది. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల [&hellip;]</p>

తనుశ్రీ దత్తా కమింగ్ బ్యాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : మీటూ ఉద్యమం తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైపోయిన తనుశ్రీ దత్తా.. రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన భామ.. కొందరు చెడు మనుషుల వల్ల నాకు నచ్చిన ఇండస్ట్రీకి, కళకు దూరం కావాలని అనుకోవడం లేదని, అందుకే మళ్లీ ఇండియాకు తిరిగొచ్చేసినట్లు తెలిపింది. తనకు బాలీవుడ్‌పై సదాభిప్రాయం ఉందన్న ఆమె.. ఇక్కడే ఉండి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లు చేస్తానని చెప్పింది. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి నిర్మాతలు, దర్శకులు తనను సంప్రదించారని.. ఇండస్ట్రీ తనను కాస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం ఆనందంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం ముగ్గురు సౌత్ ఫిల్మ్ మేనేజర్స్‌, ముంబైలోని 12 కాస్టింగ్ ఆఫీసులతో టచ్‌లో ఉన్నానని తెలిపింది. ఇప్పటికే కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్‌లో యాక్ట్ చేశానని.. మళ్లీ యాక్టింగ్ చేసేందుకు 15 కిలోలు వెయిట్ తగ్గినట్లు తెలిపింది.

కాగా తను శ్రీ దత్తా.. చివరగా 2010లో వచ్చిన ‘అపార్ట్‌మెంట్’ సినిమాలో కనిపించింది. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చంపుకోలేక.. రీ ఎంట్రీ ఇస్తోంది.

Next Story