- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ల వేతనాలను 15% పెంచాలి: తమ్మినేని
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్‌లో కూడా సేవలందిస్తున్న డాక్టర్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గత సంవత్సరమే ఈ హామీనిచ్చినప్పటికీ ప్రభుత్వం అమలు జరపలేదని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో అసోషియేషన్‌లు మే 26 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయని, సమ్మె జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అందులో స్పష్టం చేశారు. కరోనా విధుల్లో వున్న కాంట్రాక్టు, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్‌లో కూడా సేవలందిస్తున్న డాక్టర్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గత సంవత్సరమే ఈ హామీనిచ్చినప్పటికీ ప్రభుత్వం అమలు జరపలేదని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో అసోషియేషన్‌లు మే 26 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయని, సమ్మె జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అందులో స్పష్టం చేశారు. కరోనా విధుల్లో వున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని డాక్టర్లకు గౌరవ వేతనం పెంచడం, వారి కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Next Story






