తమిళ నటుడు ఆత్మహత్య.. విషాదంలో ఇండస్ట్రీ

by  |
Tamil TV Actor Indrakumar
X

దిశ, సినిమా: తమిళ్ టెలివిజన్ యాక్టర్ ఇంద్రకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం సినిమాకు వెళ్లిన ఇంద్రకుమార్..తిరిగి వచ్చాక ఫ్రెండ్ ఇంట్లో ఒంటరిగా పడుకున్నాడు. స్నేహితులు అక్కడ నుంచి వెళ్లిపోయి..తిరిగి ఇంద్రకుమార్ కోసం మళ్లీ అక్కడికి వెళ్లగా అక్కడ విగతజీవిగా కనిపించాడు. ఇంద్రకుమార్ స్నేహితులు పోలీసులకు ఈ సమాచారం అందించగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు..ఆ ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇంద్రకుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకున్నారు.


Next Story

Most Viewed