- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళ రాష్ట్ర గీతంగా ‘తమిళ్ తాయి’
by Shamantha N |
<p>చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ తల్లిని గొప్పతనాన్ని అభివర్ణిస్తూ రాసిన తమిళ్ తాయి వాజుతును రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఈ పాట వినిపించినప్పుడు తప్పనిసరిగా లేచి నిల్చొని, గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు. ఇటీవలే మద్రాస్ హైకోర్టు దీనిని కేవలం ప్రార్థన గీతం మాత్రమేనని జాతీయ గీతం కాదని పేర్కొంది. అంతేకాకుండా ఈ పాట వినగానే ఎవరూ లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్ర […]</p>

X
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ తల్లిని గొప్పతనాన్ని అభివర్ణిస్తూ రాసిన తమిళ్ తాయి వాజుతును రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఈ పాట వినిపించినప్పుడు తప్పనిసరిగా లేచి నిల్చొని, గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు. ఇటీవలే మద్రాస్ హైకోర్టు దీనిని కేవలం ప్రార్థన గీతం మాత్రమేనని జాతీయ గీతం కాదని పేర్కొంది. అంతేకాకుండా ఈ పాట వినగానే ఎవరూ లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్ర గీతంగా నిర్ణయిస్తూ నూతన జీవోను జారీ చేశారు. నిల్చోవడానికి వీలులేని వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆధీనంలోని కార్యాలయాల్లో ఆలపించాలని పేర్కొంది.
Next Story






