తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం

by  |
తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం
X

చెన్నై: తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై దాఖలైన కేసులను ఎత్తివేస్తామని వెల్లడించారు. అలాగే, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనల కారణంగా నమోదైన కేసులనూ నిలిపి వేస్తామని తెలిపారు. ఈ రెండు విభాగాల్లో తీవ్ర నేరపూరిత కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తామని వివరించారు. 2019లో సీఏఏ ఆందోళనల్లో చాలా తక్కువ సంస్థలే పాల్గొన్నాయని, చట్ట ప్రతులను కాల్చేయడం, ర్యాలీలు చేయడం వంటి నిరసనలు చేశారని సీఎం వివరించారు.

వీరిపై సుమారు 1500 కేసులు నమోదయ్యాయని, ఇందులో తీవ్ర నేరాలు మినహా అన్నింటిని ఎతివేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి కాలంలో విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై, తప్పుడు వార్తలు, వదంతులను ప్రచురించిన వారిపైనా సుమారు 10 లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయని సీఎం చెప్పారు. ఈ పాస్‌లను అక్రమంగా పొంది దుర్వినియోగం చేయడం, ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులపైనే దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు.


Next Story

Most Viewed